Header Banner

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ ముగిసింది! కమిటీ నివేదికపై ఆసక్తి!

  Sun Feb 02, 2025 21:46        Politics

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ ముగిసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‍ సత్యనారాయణమూర్తితో పాటు పలువురు సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తిరుపతి కలెక్టరేట్​లో విచారణ జరిపింది. టీటీడీ ఈవో శ్యామలరావు, పలువురు పోలీస్‍ అధికారులను కమిటీ విచారించింది. జ్యుడీషియల్ ఎంక్వయిరీలో భాగంగా మూడు రోజులుగా తిరుపతిలో కమిటీ పర్యటించింది. నగరంలోని తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్, రామానాయుడు పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతాలను శనివారం పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుంది. ఎనిమిది ప్రాంతాల్లో ఏకాదశి టికెట్లు మంజూరు చేసిన విధానంపై ఆరా తీసింది. విచారణ నేపథ్యంలో కమిటీ పలు దస్త్రాలను సేకరించింది. త్వరలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందజేయనుంది.

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!   


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #thirupathi #thirumala #inquiry #todaynews #flashnews #latestupdate